BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 13 August 2026, 02:01 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే గురువుల పట్ల జీవితాంతం కృతజ్ఞతతో ఉండాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 02:01 PM
55 వీక్షణలు

విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే గురువుల పట్ల జీవితాంతం కృతజ్ఞతతో ఉండాలి చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతారని, అందువల్ల గురువుల పట్ల విద్యార్థులు జీవితాంతం కృతజ్ఞతతో ఉండాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పిలుపునిచ్చారు.

గురువారం చింతలపూడి బాలికల సమీకృత వసతి గృహంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వసతి గృహ విద్యార్థినులకు దుప్పట్లు, స్వెట్టర్లు, రాత్రి దుస్తులు, రగ్గులు, తువ్వాళ్లతో కూడిన కిట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పుస్తకాలు, దుస్తులు, ఇతర సామగ్రిని నాణ్యతతో అందించడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యలో ఉన్నత ఫలితాలు సాధించాలని సూచించారు.

తమ విద్యాసంస్థకు, వసతి గృహానికి, తద్వారా తమ గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, వసతి గృహ సంక్షేమ అధికారులు, కూటమి నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.