www.ntodaynews.com
విద్యార్థులకు మధ్యాహ్న భోజన ప్లేట్లు పంపిణీ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విద్యార్థులకు మధ్యాహ్న భోజన ప్లేట్లు పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం చౌటపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అవసరమైన మధ్యాహ్న భోజన ప్లేట్లను బుధవారం పంపిణీ చేశారు.
ఆంగ్ల ఉపాధ్యాయుడు యం. రాం ప్రదీప్ చొరవతో పాఠశాల సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యార్థం మధ్యాహ్న భోజనం సమయంలో ఉపయోగపడేలా ప్లేట్లను అందజేశారు.
అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గానుగపాడు విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన ప్లేట్లను పంపిణీ చేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి సహకారం అందించిన ఉపాధ్యాయుడు రాం ప్రదీప్‌ను పాఠశాల సిబ్బంది అభినందించారు.