BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 09:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి విస్సన్నపేట ఎంఈవో సుధాకర్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:42 PM
72 వీక్షణలు

విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి విస్సన్నపేట ఎంఈవో సుధాకర్ 

వంట ఏజెన్సీలు, ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓ ఈ. సుధాకర్ సూచనలు

విస్సన్నపేట: విద్యార్థులకు రుచికరమైన, పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందించాలని విస్సన్నపేట మండల విద్యాశాఖాధికారి ఈ. సుధాకర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వంట ఏజెన్సీలను కోరారు.

మండలంలోని ముతరాసిపాలెం ప్రాథమిక పాఠశాలను సందర్శించిన సందర్భంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని పరిశీలించారు. భోజన నాణ్యత, పరిశుభ్రతపై వంట ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు.

అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్‌ను పరిశీలించారు. అందులో పెంచుతున్న ఆకుకూరలు, కూరగాయల మొక్కలు, పూల మొక్కలను చూసి ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులకు పచ్చని వాతావరణం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పెంపొందించడంలో కిచెన్ గార్డెన్‌లు ఉపయోగపడతాయని తెలిపారు.

పాఠశాల విద్యార్థులు అందరూ చక్కగా చదవడం పట్ల ఎంఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని సూచించారు.