BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 March 2026, 05:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమెరికా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా గర్జించిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Mar, 2026 - 05:13 PM
214 వీక్షణలు

విజయవాడ ధర్నా చౌక్‌లో అమెరికా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా గర్జించిన సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 

విజయవాడ ధర్నా చౌక్‌లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమెరికా యుద్ధోన్మాద వ్యతిరేక బహిరంగ సభ రాజకీయ వేడి రాజేసింది. ఈ సభలో ప్రముఖ నాయకుడు డి. హరినాథ్ తీవ్రంగా స్పందిస్తూ “యుద్ధం వద్దు… ప్రపంచ శాంతి కావాలి” అని పిలుపునిచ్చారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేసిన ఆయన, అమెరికాలోనే దాదాపు 90 లక్షల మంది ప్రజలు ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచాన్ని యుద్ధాల వైపు నెట్టే అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.

భారతదేశ సార్వభౌమాధికారాన్ని అమెరికా ప్రభావానికి లోనయ్యేలా చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను హరినాథ్ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను లక్ష్యంగా చేసుకుని, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేశారు. సభకు ఉదయ్ కిరణ్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగార్రావు, ఆర్. నాగమణి, టి. అరుణ, డి. పుల్లారావు, వేమన వెంకటేశ్వర్లు, ఓబయ్య, బక్కయ్య, పూజిత, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సభలో నాయకులు సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిస్తూ, శాంతి కోసం ప్రజలు ఐక్యంగా నిలవాలని కోరారు.