వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్ లో నిధుల కేటాయింపులు ఎక్కడ?
వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్ లో నిధుల కేటాయింపులు ఎక్కడ?, చేయూత పెన్షన్స్ పెంపుకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం NPRD ఆధ్వర్యంలో నిరసన
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం రోజున భువనగిరి పట్టణంలోని వినాయక చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంపై రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు ఈ సందర్బంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురూపంగా ప్రకాష్, వనం ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించింది అని అన్నారు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన 3,24,234 కోట్ల బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 5 శాతం నిధులు కేటాయించాలి.కానీ బడ్జెట్ కేటాయింపుల్లో వికలాంగుల సంక్షేమ శాఖను పూర్తిగా విస్మరించారు.2025-26 బడ్జెట్లో 77 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో నిధుల కేటాయింపులో ఎలాంటి పురోగతి లేదు.మహిళా,శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖకు 3143 కోట్లు కేటాయించిందని, ఇందులో వికలాంగుల సంక్షేమనికి ఎంత కేటాయించారో ప్రకటించాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో చేయూత పెన్షన్స్ పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2025-26 బడ్జెట్లో 14,628.91 కోట్లు కేటాయిస్తే 2026-27 బడ్జెట్లో 14,861 కోట్లు కేటాయించారు.2023 డిసెంబర్లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజపాలనలో చేయూత పెన్షన్స్ కోసం 24.85 లక్షల మంది దరఖాస్తూలు చేసుకుంటే బడ్జెట్లో 232.09 కోట్లు అదనంగా కేటాయించిన ప్రభుత్వం అర్హులైన 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్స్ మంజూరు చేస్తామని ప్రకటించడం అంటే చేయూత లబ్ధిదారులను మోసం చేయడమే అవుతుంది.పుట్టిన బిడ్డ నుండి 5 ఏండ్ల లోపు వయస్సున్న పిల్లలో పుట్టుకతో వచ్చే వైకల్యాలను గుర్తించి,శాశ్వత అంగవైకల్యంగా మారకుండా నివారించడానికి ప్రకటించిన బాలభరోసా పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా పథకాన్ని ఏవిదంగా అమలు చేస్తారు. వికలాంగులకు సహాయ పరికరాల కొనుగోలు కోసం బడ్జెట్లో నిధులు కేటాయించలేదు.ప్రభుత్వ కార్యాలయలను వికలాంగులు వినియోగించుకునెందుకు అనుకూలంగా లేని 95 శాతం ప్రభుత్వం కార్యాలయాలను వికలాంగులు వినియోగించుకునే విదంగా మార్చడానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు.బడ్జెట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించింది.ఇంటర్మిడియట్ చదువుతున్న వికలాంగులకు రేట్రోఫిట్టెడ్ మోటారైజ్డ్ వాహనాలను అందించాలని బడ్జెట్లో ప్రస్థావించిన ప్రభుత్వం,నిధులు మాత్రం కేటాయించలేదు. వికలాంగుల మధ్య జరిగే వివాహలను ప్రోత్సహిస్తూ 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం నిధులు మాత్రం కేటాయించలేదని, వికలాంగులలో ఆర్థిక అభివృద్ధి కోసం వికలాంగులతో 18,000 స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం నిధుల కేటాయింపు ప్రస్తావన లేదు.వైద్య, ఆరోగ్య శాఖకు 13,629 కోట్లు కేటాయించిన ప్రభుత్వం,రాష్ట్రంలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్య కోసం నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చేసింది. రాష్ట్ర బడ్జెట్లో కాంట్రాక్టులు,కమిషన్స్ కోసమే నిధులు కేటాయించారు తప్ప ప్రజల అభివృద్ధి, సంక్షేమనికి నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం కనిపిస్తుంది.అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను సవరించి వికలాంగుల సంక్షేమానికి నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు.మార్చి 21 న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో బడ్జెట్ పత్రాలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి,జిల్లా కోశాధికారి కొత్త లలిత, భువనగిరి మండల నాయకులు పాండాల శ్రీహరి, ఎండి సలాం, గోపి, దండ బోయిన గణేష్, రాసాల నవీన్, కృష్ణయ్య, ఉద్దామర్రి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు