BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 03 August 2026, 09:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వికలాంగురాలి ఆవేదనకు న్యాయం చేయాలని అధికారులకు వినతి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 09:00 PM
54 వీక్షణలు

వికలాంగురాలి ఆవేదనకు న్యాయం చేయాలని అధికారులకు వినతి

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట:

విస్సన్నపేట మండల ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)లో సోమవారం ఓ వికలాంగురాలు తన గోడును అధికారుల ముందుంచింది. మండలంలోని కొర్లమండ గ్రామ శివారు నాయకులగూడెంకు చెందిన జువ్వనబోయిన పుష్పవతి, వర్షపు నీటి ప్రవాహానికి అడ్డుగా మట్టికట్ట వేయడంతో ప్రతి వర్షానికీ తన ఇంటిలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అర్జీలో పేర్కొంది.

తనకు ఐదు సెంట్ల నివేశన స్థలంలో రేకుల షెడ్డు మాత్రమే ఉందని, తాను వికలాంగురాలినని, వివాహం కాలేదని, ఒంటరిగా జీవిస్తున్నానని తెలిపింది. గ్రామంలో కొందరు తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని, దారికి అడ్డంగా మట్టికట్ట వేయడంతో చిన్న వర్షం పడినా ఇంట్లోకి నీరు చేరి జీవనం దుర్భరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ విషయాన్ని ప్రశ్నించినప్పటి నుంచి మరింతగా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ, వెంటనే ఆ మట్టికట్టను తొలగించి తనకు న్యాయం చేయాలని, వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని మండల తహసీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణికి వినతిపత్రం సమర్పించింది.

ఈ సందర్భంగా న్యాయవాది సిరసాని ప్రకాష్ మాట్లాడుతూ, వికలాంగురాలి పరిస్థితిని సామాజిక బాధ్యతగా పరిగణించి అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిశీలించి న్యాయం చేయాలని మండల రెవెన్యూ అధికారులను కోరారు. గ్రామంలో పరిస్థితిని పరిశీలించి, వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న మట్టికట్టను తొలగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.