BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 04 June 2026, 07:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 07:49 PM
126 వీక్షణలు

విస్సన్నపేటలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

ఎరువుల అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ హెచ్చరించారు. బుధవారం విస్సన్నపేట మండలంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తనిఖీల సందర్భంగా యూరియా నిల్వలు, ఐఎఫ్‌ఎంఎస్ స్టాక్ రిజిస్టర్లు, భౌతిక నిల్వలు, రికార్డులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు ఎరువుల విక్రయాలు నిర్వహించాలని డీలర్లకు సూచించారు.

అనధికారికంగా ఎరువుల విక్రయాలు, నిల్వల్లో వ్యత్యాసాలు లేదా అక్రమాలు గుర్తిస్తే సంబంధిత డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో స్పష్టం చేశారు.

ఈ తనిఖీల్లో తహసీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణి, మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి, ఎస్సై అర్జున్, రెవెన్యూ డీటీ విజయభాస్కర్, వ్యవసాయ ఏఈఓ జీ. ఉషారాణి పాల్గొన్నారు.