BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 26 June 2026, 06:09 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో హమాలీల ఆగ్రహం.. కూలి బకాయిలపై సివిల్ సప్లై పాయింట్ ఎదుట ఏఐటీయూసీ ధర్నా!

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:09 AM
83 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం స్థానిక విస్సన్నపేట లో

నెలల తరబడి కష్టపడి పనిచేసినా కూలి డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తూ సివిల్ సప్లై హమాలీ ముఠా వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు విస్సన్నపేట సివిల్ సప్లై పాయింట్ ఎదుట ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా చేపట్టిన ఈ ధర్నాలో కార్మికులు ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకుడు మర్సకట్ల త్యాగరాజు మాట్లాడుతూ, "రెక్కాడితే గానీ డొక్కాడని హమాలీలకు చేసిన పనికి నెలలు గడిచినా కూలి చెల్లించకపోవడం దారుణం. మే నెలలో చేసిన పనికి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు కుటుంబాలను ఎలా పోషించాలి?" అని ప్రశ్నించారు.

అలాగే విస్సన్నపేట మండలంలోని మూడు రేషన్ షాపుల ఎగుమతి, దిగుమతి పనులను స్థానిక హమాలీలకు కాకుండా తిరువూరు పాయింట్ కార్మికులతో చేయించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ పనులను విస్సన్నపేట హమాలీ కార్మికులకే అప్పగించాలని డిమాండ్ చేశారు.

హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్న కూలి బకాయిలు, ఉపాధి సమస్యలు, ఇతర పెండింగ్ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని హెచ్చరించారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ ధర్నాకు ఏఐటీయూసీ ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు దంతాల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా, పెద్ద సంఖ్యలో హమాలీ కార్మికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.