BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 25 June 2026, 07:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వల్లంపట్ల పాఠశాల విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 07:17 PM
116 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, ఏ.కొండూరు మండలం వల్లంపట్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విలేజ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఇంజనీర్ కుటుంబ నాగేశ్వరరావు విద్యార్థులకు 32 స్టీల్ వాటర్ బాటిల్స్ అందజేశారు. మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) కేశవరావు చేతుల మీదుగా విద్యార్థులకు బాటిల్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎంఈఓ కేశవరావు మాట్లాడుతూ, ప్రతిరోజూ తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలిపారు. స్టీల్ వాటర్ బాటిల్స్ వినియోగం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించి, భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుని తమ గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు భూక్య సుబ్రహ్మణ్యం, శ్రీకాకుళపు శామ్యూల్ విద్యార్థులతో కలిసి కుటుంబ నాగేశ్వరరావు సేవాభావాన్ని అభినందించారు. స్వగ్రామ అభివృద్ధి కోసం ముందుకు వచ్చి విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను అందించడం ఆదర్శప్రాయమని కొనియాడారు.

ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆనందాన్ని నింపడంతో పాటు, సమాజ సేవకు ఒక మంచి ఉదాహరణగా నిలిచింది.