BREAKING
thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్
Date of Publish : 25 March 2026, 09:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వరంగల్ జిల్లాలో స్కానింగ్ సెంటర్ నిర్వాకం

తెలంగాణ
/ వరంగల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Mar, 2026 - 09:34 PM
194 వీక్షణలు

వరంగల్ జిల్లాలో స్కానింగ్ సెంటర్ నిర్వాకం – బాలికకు తప్పుడు గర్భ నిర్ధారణ రిపోర్ట్ కలకలం

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఓ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌లో తీవ్ర నిర్లక్ష్యం వెలుగుచూసింది. కడుపు నొప్పితో వచ్చిన చిన్నారి బాలికకు గర్భిణీగా ఉందని తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం స్థానికంగా కలకలం రేపింది.

ఈ రిపోర్ట్ చూసి షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే మరో నర్సింగ్ హోమ్‌లో పరీక్షలు చేయించగా, బాలికకు గర్భం లేదని, స్వల్ప ఆరోగ్య సమస్య మాత్రమే ఉందని వైద్యులు స్పష్టం చేశారు.

దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు సంబంధిత స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి వైద్యుడిని నిలదీసి, దాడికి కూడా పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

ఇలాంటి తప్పుడు రిపోర్టులు కుటుంబాలను మానసికంగా కుదేలు చేస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, వైద్య నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయం సంబంధిత అధికారుల దృష్టికి చేరినట్లు సమాచారం. స్కానింగ్ సెంటర్‌పై విచారణకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్ల పనితీరుపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.