BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 07:57 pm
Posted by : V శ్రీనివాస్

​వర్షాకాలం దృష్ట్యా మంచిర్యాల 39వ డివిజన్‌లో మేయర్, అధికారుల పర్యటన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 Jul, 2026 - 07:57 PM
93 వీక్షణలు
​వర్షాకాలం దృష్ట్యా మంచిర్యాల 39వ డివిజన్‌లో మేయర్, అధికారుల పర్యటన
  • అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • అధికారులకు తగిన సూచనలు జారీ చేసిన అదనపు కలెక్టర్, మేయర్

​మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ చంద్రయ్య, మేయర్ శ్రీ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ మరియు మున్సిపల్ కమిషనర్ జి. అన్వేష్ లు 39వ డివిజన్‌లో పర్యటించి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షపు నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు వారు తగిన సూచనలు చేశారు. అలాగే, వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా పరిసరాల్లో ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, ఇంటింటి చెత్త సేకరణకు వచ్చే పారిశుధ్య సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించి డివిజన్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.

​ఈ క్షేత్రస్థాయి పరిశీలన, సమీక్షా కార్యక్రమంలో అదనపు కలెక్టర్, మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్‌లతో పాటుగా అసిస్టెంట్ కమిషనర్ రాజకుమార్, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి పుదరి సునీత ప్రభాకర్, శానిటరీ ఇన్స్పెక్టర్, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు