BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 March 2026, 04:12 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గ్రామ పరిశుభ్రత ప్రజలందరి బాధ్యత

తెలంగాణ
06 Mar, 2026 - 04:12 AM
245 వీక్షణలు
  గ్రామ పరిశుభ్రత ప్రజలందరి బాధ్యత: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి NTODAY NEWS: బొమ్మలరామారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంలో గ్రామాల పరిశుభ్రతకు ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు భాగస్వాములు కావాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామంలో చేపట్టిన పారిశుధ్య పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామంలో పర్యటించిన కలెక్టర్ పరిశుభ్రత, పారిశుధ్య పనులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కాలనీలో చెత్త పేరుకుపోకుండా శుభ్రపరచాలని, మురికి కాల్వలు మరియు రోడ్ల ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించాలని సూచించారు. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని అన్నారు. ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు వాటర్ ట్యాంక్‌లలో క్లోరినేషన్ చేయాలని, వాటిని ప్రతి నెల శుభ్రం చేయాలని ఆదేశించారు. అలాగే ఆర్థిక సంవత్సరానికి మార్చి నెల చివరి నెల కావడంతో ఇంటి పన్నుల వసూళ్లను పూర్తి చేసి క్లియర్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి. శ్రీనివాస్ రావు, హౌసింగ్ పీడీ శ్రీ రాములు, ఇన్‌చార్జ్ ఎంపీడీవో గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బట్కీరు జ్యోతి బీరప్ప, గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్, ఉప సర్పంచ్ రామిడి దయాకర్ రెడ్డి, వార్డ్ మెంబర్లు గుజ్జ వెంకటేష్, హౌసింగ్ ఏఈ ప్రశాంత్, ప్రజా ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. #Bommalaramaram #NagineniPalli #AnuragJayanti #VillageSanitation #PrajaPalana #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube