BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

హయత్‌నగర్‌లో విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్

తెలంగాణ
06 Jan, 2026 - 08:34 AM
234 వీక్షణలు

8న హయత్‌నగర్‌లో విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 59వ బ్రాంచ్ ప్రారంభం

NTODAY NEWS: సైదాబాద్ రిపోర్టర్ పగడాల దేవయ్య సహకార వ్యవస్థ బలోపేతంతోనే ఆర్థిక అంతరాల తగ్గింపు. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద అర్బన్ బ్యాంకుగా విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్. దేశంలోని 1,457 అర్బన్ బ్యాంకుల్లో షేర్ క్యాపిటల్‌లో ప్రథమ స్థానం. తెలుగు రాష్ట్రాల్లో 58 బ్రాంచ్‌లతో సామాన్యులకు సేవలు. గత ఏడాది నికర లాభం రూ.71.77 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో నూజివీడు, తెనాలి, అమలాపురం, హయత్‌నగర్‌తో పాటు విశాఖలో మరో కొత్త బ్రాంచ్. ఈ ఆర్థిక సంవత్సరం కార్యకలాపాల లక్ష్యం రూ.8,600 కోట్లు. ఐదేళ్లలో హయత్‌నగర్ బ్రాంచ్ ద్వారా రూ.100 కోట్ల లావాదేవీల లక్ష్యం. హయత్‌నగర్,  సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న ఆర్థిక అంతరాలను తగ్గించాలంటే సహకార వ్యవస్థను బలోపేతం చేయడమే సరైన మార్గమని ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ జె.వి. సత్యనారాయణ మూర్తి అన్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని గాంధీ బొమ్మ సమీపంలో, పాత బస్టాండ్ ఎదురుగా బ్యాంకు 59వ నూతన శాఖను జనవరి 8, 2026న ప్రారంభించనున్న సందర్భంగా బుధవారం బ్యాంకు ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, మరోవైపు సామాన్యుల ఆర్థిక స్థితిగతులు రోజు రోజుకు దిగజారడం ఆందోళన కలిగిస్తోందన్నారు. దేశంలో పేద మరియు మధ్యతరగతి ప్రజల ఆర్థిక అవసరాలకు సహకార అర్బన్ బ్యాంకులు బాసటగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. 1916 ఫిబ్రవరి 5న విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించిన ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్, నేడు తెలుగు రాష్ట్రాల్లో 58 బ్రాంచ్‌ల ద్వారా బహుళ రాష్ట్రాల అర్బన్ బ్యాంకుగా ప్రజలకు సేవలు అందిస్తోందన్నారు. భారతదేశ సహకార రంగంలో నాన్ షెడ్యూల్డ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల్లో అతిపెద్దదిగా నిలిచి, సహకార సూత్రాలను త్రికరణశుద్ధిగా పాటిస్తూ ప్రత్యేక గుర్తింపును సాధించిందన్నారు. డిపాజిటర్లను సభ్యులుగా చేర్చడం ద్వారా బ్యాంకు పాలకవర్గ నిర్ణయాల్లో వారిని భాగస్వాములను చేస్తూ నూతన ఒరవడితో ముందుకు సాగుతోందన్నారు. వాణిజ్య బ్యాంకుల నుంచి సహకారం పొందలేని ప్రజలకు విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రత్యామ్నాయ బ్యాంకుగా గుర్తింపు పొందిందని తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube