BREAKING
తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు
Date of Publish : 10 March 2026, 03:42 am
Posted by : NTODAY NEWS OFFICIAL

హుజురాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

తెలంగాణ
10 Mar, 2026 - 03:42 AM
411 వీక్షణలు

అట్టహాసంగా మున్సిపల్ చైర్మన్ సుహాసిని పదవి స్వీకరణ కార్యక్రమం

NTODAY NEWS: హుజురాబాద్ ప్రతినిధి రాజేష్ తాళ్లపల్లి

హుజురాబాద్ ప్రాంత ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా సుహాసిని పదవి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

భారీ ర్యాలీ నిర్వహణ

ఈ సందర్భంగా అంబేద్కర్ చౌక్ వద్ద డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అంబేద్కర్ చౌక్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మార్గమధ్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు రాజేశ్వర్ రావు, జగ్ జీవన్ రామ్ విగ్రహాలకు కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ జెండా

హుజురాబాద్ గడ్డపై దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఆనందంగా ఉందని వొడితల ప్రణవ్ తెలిపారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, అనంతరం అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు.

అభివృద్ధికి ప్రత్యేక నిధులు

హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధి కోసం సుమారు ₹300 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజురాబాద్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

సంక్షేమం – అభివృద్ధి లక్ష్యం

మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ప్రజా పాలన కార్యక్రమాల ద్వారా మెడికల్ క్యాంపులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.

భారీగా హాజరైన కాంగ్రెస్ శ్రేణులు

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వొడితల ప్రణవ్, మున్సిపల్ కమిషనర్ అహ్మద్ సయ్యద్, 30 వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


#Huzurabad #PonnamPrabhakar #CongressParty #TelanganaPolitics #MunicipalChairperson #NTodayNews