BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 January 2026, 08:16 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి

తెలంగాణ
24 Jan, 2026 - 08:16 PM
387 వీక్షణలు
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి తొర్రూరులో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం NTODAY NEWS: పాలకుర్తి నియోజకవర్గం రిపోర్టర్ వేణు రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తొర్రూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధ్యక్షత వహించారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గత ప్రభుత్వ పదేళ్ల అహంకారాన్ని ప్రజలు కొద్ది రోజుల్లోనే తిప్పికొట్టారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వానికి మరింత బలం చేకూరాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లే పార్టీలో కూడా ఉంటాయని, వాటిని సరిదిద్దుకుని ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు కూడా అపాయింట్‌మెంట్ దొరకని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు సామాన్యులకు కూడా సీఎం అపాయింట్‌మెంట్ లభిస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మినీ స్టేడియం కోసం వినతి అనంతరం పాలకుర్తి నియోజకవర్గంలో మినీ స్టేడియం మంజూరు చేయాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి మినీ స్టేడియం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #Palakurthi #Thorrur #CongressParty #MunicipalElections #PoliticalMeeting #TelanganaPolitics #CongressLeaders #MiniStadium #PublicGovernment #LocalBodyElections Follow us on Website Facebook Instagram YouTube