BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 08 January 2026, 10:00 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జాతీయ రహదారిని 8 లైన్లుగా విస్తరిస్తాం

తెలంగాణ
08 Jan, 2026 - 10:00 AM
362 వీక్షణలు

జాతీయ రహదారిని 8 లైన్లుగా విస్తరిస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

చిట్యాలలో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పరిశీలన NTODAY NEWS: చిట్యాల 65వ నంబర్ జాతీయ రహదారిని 8 లైన్లుగా విస్తరిస్తామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 65వ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ కోసం 17 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం విస్తరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వనస్థలిపురం, అబ్దులపూర్ మెట్, ఆర్‌ఎఫ్‌సీ ప్రాంతాల్లో కూడా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా 9 లక్షల 97 వేలకుపైగా వాహనాల రాకపోకలు జరిగాయని, అప్పటి అనుభవాల ఆధారంగా ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పెద్ద కాపర్తి, చిట్యాల, కోర్లపహాడ్ ప్రాంతాల్లో ప్రయాణికులు ప్రశాంత వాతావరణంలో ప్రయాణించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, రవాణా శాఖలతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ జామ్‌లు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. 65వ జాతీయ రహదారిని 8 లైన్లుగా విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధం చేశామని, మార్చి నెలలో టెండర్లు పిలిచి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చడం శుభపరిణామమని, నల్గొండ, మిర్యాలగూడ ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, డిటిసి వాణి తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube