BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 12 September 2025, 10:45 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

సింగరేణి లాభాల్లో కార్మికులకు 35 శాతానికిపైగా వాటా ఇవ్వాలి

తెలంగాణ
12 Sep, 2025 - 10:45 PM
403 వీక్షణలు
సింగరేణి లాభాల్లో కార్మికులకు 35 శాతానికిపైగా వాటా ఇవ్వాలి NTODAY NEWS: హైదరాబాద్. అలియాస్ పేర్ల కార్మికుల సమస్యలు మానవతాదృక్పదంతో పరిష్కరించాలి వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి సింగరేణి సీఎండీని కోరిన హెచ్ ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు 35 శాతానికిపైగా వాటా ఇవ్వాలని, దసరాకు ముందే బోనస్ కార్మికులకు అందజేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, కార్మిక నాయకులు, కార్మిక కుటుంబాలతో సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ను కలిసి పలు సమస్యల పై మెమోరాండం ఇచ్చారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ, అలియాస్ పేర్లతో ఉద్యోగంలో చేరిన నలుగురు కార్మికులను డిస్మిస్ చేయడం దారుణమని వారికి ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని కోరామన్నారు. మెడికల్ బోర్డు వల్ల నష్టపోయిన 54 మంది కార్మికుల వారసుల కోసం రీ మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. అలాగే గతంలో మాదిరిగా నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు నిర్వహించాలని కోరారు. పదో తరగతి పాస్ కాలేదనే సాకుతో పెండింగులో పెట్టిన ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలి అని ఎలాంటి చదువు లేకున్నా డిపెండెంట్లకు ఉద్యోగలు ఇవ్వాలని కొరమని చెప్పామన్నారు. పెండింగ్ లో ఉన్న క్లరికల్ పరీక్ష నిర్వహించాలి అని పరీక్షకు సిద్ధం అయినా అభ్యర్థులకు న్యాయం చేయాలి. నిమ్స్ టారిఫ్ పేరిట నాణ్యమైన వైద్యం అందలేకపోతుంది దీని స్థానంలో CGHS పాలసీ అమలు చేసి కార్మికులకు నాణ్యమైన వైద్యం అందించాలి. భూనిర్వాసితులకు కంపెనీ లో ఉద్యోగం ఇచ్చే విధంగా పాలసీ చేయాలి అని కోరారు గతంలో 600 మంది భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశం కల్పించిన విధంగా ఇతరులకు కూడా ఉద్యోగం ఇవ్వాలి.190/240 నిండిన బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ గా రెగ్యులరైజ్ చేయాలి.పెర్క్స్ అలవెన్సు పై టాక్స్ రద్దు చేయాలి. ప్రతి ఏరియాలో CBSE స్కూల్స్ ఏర్పాటు చేయాలి తాము లేవనెత్తిన అంశాలను పరిష్కరిస్తామని సీఎండీ హామీ ఇచ్చారని తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube