BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 30 August 2026, 07:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌పై సీపీఎం ఆగ్రహం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:46 AM
9 వీక్షణలు

ప్రాజెక్టుల కంటే కమీషన్లపైనే ప్రభుత్వానికి శ్రద్ధ : సీపీఎం నేతలు

పెండింగ్ ప్రాజెక్టుల నిధుల సాధన కోసం మూడు రోజుల పాదయాత్ర ప్రారంభం

యాదాద్రి భువనగిరి:

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి పురోగతి లేదని సీపీఎం నేతలు విమర్శించారు. ప్రభుత్వం ప్రాజెక్టుల పూర్తిపై కాకుండా కమీషన్లపైనే దృష్టి పెడుతోందని ఆరోపించారు.

భువనగిరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు సాధించాలనే డిమాండ్‌తో సీపీఎం చేపట్టిన మూడు రోజుల పాదయాత్రను మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొండమడుగు నరసింహ అధ్యక్షత వహించారు.

చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ 2006లో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం సీపీఎం 2 వేల కిలోమీటర్ల మేర రెండు నెలల పాటు పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లిందన్నారు. అప్పట్లో రూ.20 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం వాటి వ్యయం వందల కోట్లకు చేరిందని విమర్శించారు.

ప్రాజెక్టులు పూర్తి చేయకుండా వరుణ యాగాలు చేస్తున్నారని, గోశాలలకు రూ.50 కోట్లు కేటాయించే ప్రభుత్వం రైతుల సాగునీటి అవసరాలకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. విషపూరిత మూసీ నీటితో ప్రజలు, పశువులు అనారోగ్యానికి గురవుతున్నా మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్‌లో పర్యాటక అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నప్పటికీ 4 లక్షల ఎకరాలు సాగుకు నోచుకోవడం లేదన్నారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో 2 లక్షల ఎకరాల్లోపే సాగు జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మూసీ ప్రక్షాళన, గోదావరి అనుసంధానం చేపడితే ఏడు జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. భవిష్యత్ నగరాలపై చూపుతున్న శ్రద్ధలో కొంత భాగం సాగునీటి ప్రాజెక్టులపై పెడితే యాదాద్రి ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు.

సాగు, తాగునీటి ప్రాజెక్టులపై తమ పార్టీ చేస్తున్న తొమ్మిది డిమాండ్లను అసెంబ్లీలో చర్చించాలని, ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఆగస్టు 31న హైదరాబాద్‌లో నిర్వహించే మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ జిల్లాలో 22 ప్రాజెక్టులు, కాల్వలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బస్వాపూర్, గందమల్ల, చర్లగూడెం బహుళార్థ ప్రాజెక్టులతో పాటు బునాదిగాని, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, ఆసిఫ్‌నహర్ కాల్వలు పూర్తి కాలేదన్నారు.

జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఇన్‌చార్జి మంత్రి ఉన్నప్పటికీ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని విమర్శించారు. గందమల్ల ప్రాజెక్టుకు రూ.450 కోట్లు అవసరం కాగా కేవలం రూ.80 కోట్లు మాత్రమే కేటాయించారని ప్రశ్నించారు.

మూసీ కాలుష్యం వల్ల క్యాన్సర్, చర్మ వ్యాధులు, గర్భస్రావ సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్, రాష్ట్ర కార్యదర్శి అనగంటి వెంకటేష్, నాయకులు బట్టుపల్లి అనురాధ, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, ఈర్ల ముత్యాలు, గూడూరు అంజిరెడ్డి, గడ్డం వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.