BREAKING
పెద్ద కాపర్తి శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు, అసలైన దొంగలు వేలాగ్రా ఎరువులు సరఫరా చేసినా నకిలీ డీలర్లే.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో మార్పులు మహిళల భద్రతకు 'ఆపరేషన్ దండాయన'.. నిందితులపై నిరంతర నిఘా ఉంచాలి: -జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ రాహుకాల అభిషేకానికి విశేష స్పందన పదో తరగతి టాపర్లను అభినందించిన APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు ​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పెద్ద కాపర్తి శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు, అసలైన దొంగలు వేలాగ్రా ఎరువులు సరఫరా చేసినా నకిలీ డీలర్లే.. తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో మార్పులు మహిళల భద్రతకు 'ఆపరేషన్ దండాయన'.. నిందితులపై నిరంతర నిఘా ఉంచాలి: -జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ రాహుకాల అభిషేకానికి విశేష స్పందన పదో తరగతి టాపర్లను అభినందించిన APNRTS - సౌదీ అరేబియా ముఖ్య కార్యదర్శి బొమ్మెర సొమ్మక్క మృతికి నివాళులు అర్పించిన పాలకుర్తి ప్రతినిధి వేణు ​సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి ​29వ రోజుకు చేరుకున్న పెరుగున్నం పంపిణీ ​వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించేలా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
www.ntodaynews.com

విద్యకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జిల్లా కలెక్టర్

తెలంగాణ
01 May, 2025 - 08:53 AM
144 వీక్షణలు
విద్యకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ NTODAY NEWS: యాదాద్రి భువనగిరి ప్రతి విద్యార్థి ఏదో ఒక దశలో తనపై నమ్మకం పెంచుకుంటాడని భవిష్యత్తును ఉత్తమంగా తీర్చిదిద్దుకుంటాడనే నమ్మకం ఉందన్నారు.పేదరికం రూపుమాపేందుకు విద్య ఒక్కటే మార్గం. ఒక్కొక్క విద్యార్థి ఒక్కో కుటుంబం అని మర్చిపోవద్దు.అందరూ ఉత్తీర్ణతతో 100% ఫలితాలు సాధించి ఉన్నత చదువు చదవాలన్నదే తన ఆకాంక్ష..అనుకున్న ప్రకారంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన 5 మందికి సైకిళ్ల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. వచ్చే ఏడాది ప్రతి కళాశాలలో నూటికి నూరు శాతం ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధిస్తే 50 సైకిళ్లు ఇస్తా...ఫలితాలు మెరుగుపరచాలన్నదే ప్రభుత్వ ధ్యేయం.రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీలో 98.09% సాధించిన ధీరజ్ కుమార్,అదే కళాశాలలో ఇంటర్ సి.ఈ.సి లో 91.60%శ్రేష్ట , ఒకేషనల్ కోర్స్ లో MLT లో 98.80% సాధించిన నందిని , వలిగొండ ఎస్.వి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపిసిలో 96.59% సాద్హించిన గంజి సరస్వతి,యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఇంటర్ హెచ్ఈసి లో 93.40% సాధించిన అభిలాషలను వారి తల్లిదండ్రులు తో సహా శాలువాలు కప్పి మెమెంటో లను అందించి అభినందించిన జిల్లా కలెక్టర్. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మండలాల కళాశాల ప్రిన్సిపల్స్ తో జిల్లా కలెక్టర్ హనుమంతరావు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సమాజాభివృద్ధికి విద్య ఎంతగానో దోహదం చేస్తుందని,అందుకు ప్రతి ఒక్కరూ చదువుకునేలా ప్రోత్సహిస్తానని ఆత్మవిశ్వాసం కల్పించి ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు గట్టి పునాది వేస్తానని,వారిఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుతానన్నారు. ఉపాధ్యాయులు ప్రతి ఒక్క విద్యార్థి కి మార్గదర్శకులు కావాలన్నారు. ప్రభుత్వ విద్య పట్ల విద్యార్థుల్లో నమ్మకం కలిగేలా అంకితభావంతో పని చేయాలన్నారు వారిలో మానసిక ధైర్యాన్ని కల్పిస్తూ విద్య పట్ల ఇష్టత కల్పించాలన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరిని ప్రభుత్వ కళాశాలలో చేరే విధంగా గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఫ్లెక్సీ, పాంప్లెట్ల ద్వారా అత్యధిక మార్కులు సాధించిన వారి వివరాలను పొందుపరిచి విస్తృత ప్రచారం చేపట్టి ప్రభుత్వ కళాశాలలో చేర్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మండలాల వారీగా సంబంధిత ప్రిన్సిపల్స్ కళాశాలల వారీగా వచ్చిన శాతమే కాకుండా కళాశాలలో చదివిన వారందరూ ఉత్తీర్ణులవ్వాలని ఉన్నత విద్య అభ్యసించేలా కృషి చేయాలన్నారు మొదటి,రెండు సంవత్సరాలలో ఫెయిల్ అయిన విద్యార్థుల పైన ఎక్కువ శ్రద్ధ పెట్టి వారిని చదివించి సప్లమెంటరీ పరీక్షలలో అందరూ పాసై డిగ్రీలో చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, డిఆర్డిఓ నాగిరెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి,ఎస్సీ షెడ్యూల్ కులాల శాఖ అభివృద్ధి అధికారి వసంతకుమారి, ఇంచార్జ్ విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డి, విద్యార్థులు వారి తల్లిదండ్రులు ,తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube