BREAKING
thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు
మంచి మాట
Date of Publish : 31 October 2026, 01:51 pm
Posted by : SEETHA KIRAN KUMAR

Yadadri : నకిలీ సిగరెట్ల దందా గుట్టురట్టు.. 51 వేల సిగరెట్లు సీజ్!

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
31 Oct, 2026 - 01:51 PM
15 వీక్షణలు

ప్రముఖ బ్రాండ్ల పేర్లు, ట్రేడ్‌మార్కులతో అక్రమ విక్రయం.. 51,100 సిగరెట్లు స్వాధీనం

తుర్కపల్లి (ఎన్‌ టుడే న్యూస్‌): ప్రముఖ సిగరెట్‌ బ్రాండ్ల పేర్లు, ట్రేడ్‌మార్కులను ఉపయోగించి నకిలీ సిగరెట్లు విక్రయిస్తున్న వ్యవహారాన్ని తుర్కపల్లి పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఒకరిని అరెస్ట్ చేసి, భారీ మొత్తంలో నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 206 కార్టన్లలో ఉన్న 51,100 సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 5,110 బాక్సులు, ఒక వాగన్‌ఆర్‌ కారు, మొబైల్‌ ఫోన్‌ను సీజ్‌ చేశారు.

విచారణలో నిందితుడు బేగంబజార్‌కు చెందిన కైలాష్‌ యాదవ్‌ వద్ద నుంచి సిగరెట్లను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఒక్కో కార్టన్‌ను రూ.60 వేల చొప్పున కొనుగోలు చేసి, రూ.80 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన తుర్కపల్లి పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నకిలీ బ్రాండ్ల పేర్లతో సిగరెట్ల విక్రయానికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు..