BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

యూపీఎస్సీలో 50వ ర్యాంక్‌తో ఐఎఫ్‌ఎస్ సాధించిన జయ అశ్వంత్ రెడ్డికి ఘన సత్కారం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 04:31 PM
137 వీక్షణలు

విజయవాడ: యూపీఎస్సీ పరీక్షల్లో ప్రతిభ చాటుతూ 50వ ర్యాంక్ సాధించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్)కు ఎంపికైన జయ అశ్వంత్ రెడ్డిని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ప్రత్యేకంగా అభినందించారు.

ఎన్టీఆర్ జిల్లాలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న బండి ఉమా మహేశ్వర రెడ్డి, వందన దంపతుల కుమారుడు జయ అశ్వంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో ఆల్ ఇండియా 50వ ర్యాంక్ సాధించి ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జయ అశ్వంత్ రెడ్డిని దుశ్శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

అలాగే, తన కుమారుడి విజయానికి కృషి చేసిన తల్లిదండ్రులు బండి ఉమా మహేశ్వర రెడ్డి, వందనలను కూడా కమిషనర్ ప్రశంసించారు. కర్నూలులో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన జయ అశ్వంత్ రెడ్డి, హైదరాబాద్‌లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివి సివిల్స్‌కు సిద్ధమవుతూ ఈ ఘన విజయాన్ని సాధించారు.

ఈ సందర్భంగా అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత కూడా జయ అశ్వంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ సరిత, ఏసీపీ ఉమా మహేశ్వర రెడ్డి, వందన తదితరులు పాల్గొన్నారు.

కృషి, పట్టుదల ఉంటే లక్ష్యం ఎంత పెద్దదైనా సాధించవచ్చని జయ అశ్వంత్ రెడ్డి మరోసారి నిరూపించారని పోలీసు అధికారులు కొనియాడారు.