BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 April 2026, 06:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యువ గుళికలతో మొక్కజొన్నలో విజయభేరి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Apr, 2026 - 06:25 PM
342 వీక్షణలు

యువ గుళికలతో మొక్కజొన్నలో విజయభేరి 

మైలవరం మండలం బాడవ గ్రామంలో ప్రముఖ విక్టర్ కంపెనీ ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతుల కోసం ప్రత్యేక సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రైతులు ఉత్సాహంగా పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.

మొక్కజొన్న పంటను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న కత్తెర పురుగును నియంత్రించడంలో ఈ ఏడాది యువ గుళికలు, హెగ్జాగార్డ్, బారియర్ వంటి ఉత్పత్తులు కీలక పాత్ర పోషించాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మందులను సమయానికి ఉపయోగించడం వల్ల పంట నష్టాలు తగ్గి, దిగుబడి గణనీయంగా పెరిగిందని వారు తెలిపారు.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా కంపెనీ జనరల్ మేనేజర్ చనుమోలు నారాయణరావు హాజరై మాట్లాడుతూ, రైతులు సరైన దశలో ఉత్పత్తులను ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వివరించారు.

అదేవిధంగా కృష్ణా జిల్లా రీజనల్ మేనేజర్ సుధీర్, సీనియర్ ఎన్ఐఓ చంద్రశేఖర్, రాంబాబు తదితరులు పాల్గొని రైతులకు సాంకేతిక సూచనలు అందించారు.

ఈ కార్యక్రమం రైతులకు అవగాహన పెంపొందించడమే కాకుండా, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై నమ్మకాన్ని మరింత బలపరిచింది.