BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 03 December 2025, 08:27 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ 2కే రన్

తెలంగాణ
03 Dec, 2025 - 08:27 AM
354 వీక్షణలు

సిఐటియు తెలంగాణ రాష్ట్ర 5 మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ 2కే రన్ 

NTODAY NEWS: హైదరాబాద్  ఈనెల డిసెంబర్ 7 .8. 9 తేదీలలో మెదక్ పట్టణంలో జరుగు సిఐటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య పార్క్ నుండి 2కె రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిఐటియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ జెండా ఊపి 2 కే రన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను యజమాన్యాలకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్లు తీసుకొచ్చిన ఈ సందర్భంలో సిఐటియు మహాసభలు జరుగుతున్నాయన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్తో నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తూ తుంగలో తొక్కిందన్నారు. కేవలం కార్పొరేట్లు పెట్టుబడిదారుల ప్రయోజనం మాత్రమే లేబర్ కోట్ల ఉద్దేశం అన్నారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులను సన్నద్ధం చేసేందుకు ఈ మహాసభల లో చర్చలు జరుగుతాయి అన్నారు. డిసెంబర్ 7వ తేదీన మెదక్ పట్టణంలో జరిగే భారీ కార్మిక బహిరంగ సభను తెలంగాణ రాష్ట్రంలోని అశేష కార్మిక వర్గం జయప్రదం చేయాలని కోరారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు. మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సామాజిక ఉద్యమాలకు సామాజిక కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా అండదండలిస్తున్న సిఐటియు మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు పద్మశ్రీ .ఎం వెంకటేష్. శ్రీకాంత్. రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు. హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎం దశరథ్, జె.కుమారస్వామి, నగర కోశాధికారి కే అజయ్ బాబు,నగర నాయకులు మల్లేష్ .జి నరేష్. శ్రీనివాస్. అజయ్ బాబు, పి మల్లేష్. సుందరయ్య పార్క్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. వాకర్స్ క్లబ్ సెంట్రల్ గవర్నర్ శైలజ. మాజీ అధ్యక్షులు రమేష్ రెడ్డి. హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం కార్యదర్శి వీరయ్య. శ్రీనివాసరావు. తదితరులు పాల్గొన్నారు Follow us on Website Facebook Instagram YouTube