BREAKING
వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు
Date of Publish : 17 December 2025, 09:00 am
Posted by : NTODAY NEWS OFFICIAL

డంపింగ్ యార్డ్ తీసివేయాలంటూ ధర్నా

తెలంగాణ
17 Dec, 2025 - 09:00 AM
199 వీక్షణలు

డంపింగ్ యార్డ్ తీసివేయాలంటూ ధర్నా

డంపింగ్ యార్డ్ సమస్య ఫోన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన గ్రామస్తులు NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డు అయిన శివనేనిగూడెం లో గల డంపింగ్ యార్డ్ ను వెంటనే అక్కడి నుండి తీసివేయాలనీ డిమాండ్ చేస్తూ బిజెపి నాయకుల ఆధ్వర్యంలో బుధవారం రోజున ధర్నా నిర్వహించారు. డంపింగ్ యార్డ్ కు చెత్తను తరలిస్తున్న ట్రాక్టర్లను , వాహనాలను డంపింగ్ యార్డ్ కు రాకుండా బిజెపి నాయకులు అడ్డుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ తమ గ్రామానికి సమీపంలో ఉండడంవల్ల చెత్త తగలబడి దాని ద్వారా వచ్చే దుర్వాసన, పోగా, దుమ్ము, బూడిది గ్రామస్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, చిన్నారులు, వృద్ధులు శ్వాసకోస సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. ఎన్నో మార్లు డంపింగ్ యార్డ్ ను తొలగించాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, డంపింగ్ యార్డ్ ను తొలగించేంతవరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా తనకు సంబంధం లేదని రెవిన్యూ అధికారులను అడగాలని చెప్పడంతో కలెక్టర్ దృష్టికి ఫోన్లో తీసుకువెళ్లడం జరిగిందని, ఆమె వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్, సీనియర్ నాయకులు కన్నెబోయిన మహలింగం, రుద్రవరం లింగస్వామి, దామనూరి నాగరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు రుద్రవరం దశరథ, కన్నెబోయిన శ్రీధర్, గుండాల ఉపేందర్, రుద్రవరం వంశీ, రుద్రవరం శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.. Follow us on Website Facebook Instagram YouTube