BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 04:14 pm
Posted by : V శ్రీనివాస్

​మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు తగ్గించొద్దు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 Jul, 2026 - 04:14 PM
237 వీక్షణలు

​మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు తగ్గించొద్దు

  • పాత వేతనాలనే యధావిధిగా కొనసాగించాలి
  • ​జీతాల్లో కోత విధిస్తే ఐక్య ఉద్యమాలు తప్పవు: సీఐటీయు, కార్మిక సంఘాల హెచ్చరిక

 మంచిర్యాల పట్టణంలోని సీఐటీయు కార్యాలయంలో బుధవారం కామ్రేడ్ కాసర్ల రాజలింగు అధ్యక్షతన జిల్లా సీఐటీయు, మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘాల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయు) జిల్లా కార్యదర్శి కాసర్ల రాజలింగు, మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం జిల్లా నాయకుడు నిరటి రాజన్న మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు కేటగిరీల వారీగా పెంచిన వేతనాలను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించి చెల్లించేలా సర్క్యులర్ జారీ చేయడం దారుణమన్నారు. కార్మికుల పట్ల ప్రభుత్వ విధానం ఏమాత్రం సరికాదని, తక్షణమే ఈ నిర్ణయాన్ని పునరాలోచించి ఎలాంటి కోతల్లేకుండా పాత వేతనాలనే యధావిధిగా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

​రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లి కార్మికుల జీతాలు తగ్గిస్తే.. జిల్లాలోని మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగ, కార్మిక సంఘాలన్నీ ఏకమై ఐక్య కార్యాచరణతో పెద్ద ఎత్తున పోరాడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక నాయకులు సురేష్, నవీన్, సీఐటీయు నాయకులు చిందం వెంకటేష్, పసుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు