BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 04:17 pm
Posted by : V శ్రీనివాస్

​NEET విద్యార్థుల భవిష్యత్తు నాశనం

జాతీయం జాతీయం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 Jul, 2026 - 04:17 PM
146 వీక్షణలు

​NEET విద్యార్థుల భవిష్యత్తు నాశనం: మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

​న్యూ ఢిల్లీ :NEET పరీక్షల అక్రమాలతో దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని, ఇందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. మన భారతదేశంలో నంబర్ వన్ పిరికివాడు ఎవడైనా ఉన్నాడంటే అది ప్రధాని నరేంద్ర మోదీయేనని ఆయన ధ్వజమెత్తారు. గత 10 సంవత్సరాలుగా ముసుగు వేసుకొని ప్రజలను మోసం చేస్తున్న మోదీ అసలు స్వరూపాన్ని, నిన్న చేపట్టిన పార్లమెంటు ముట్టడి కార్యక్రమంతో దేశ యువతీ యువకులు పూర్తిగా తొలగించి బయటపెట్టారని, భారతదేశ యువత ఇప్పుడు మేల్కొంటోందని ఆయన స్పష్టం చేశారు.

​మోదీకి కుటుంబం, పిల్లలు లేరని, అందుకే నిన్నటి ఆందోళనలో మన పిల్లలు, భారత్ యువత చిందించిన కన్నీళ్లు, వారి ఆవేదన మోదీకి వినిపించలేదని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో నంబర్ వన్ 'యాంటీ నేషనల్' ప్రధాని నరేంద్ర మోదీయేనని విమర్శించారు. గత 10 ఏళ్లుగా పిల్లలతో, వారి భవిష్యత్తుతో ఆడుకుంటూ, నీట్ పేపర్లు అమ్ముకొని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని దుయ్యబట్టారు. విద్యార్థుల జీవితాలను తలకిందులు చేసినందుకు నరేంద్ర మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరూ సిగ్గుతో తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు