BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 03 August 2026, 09:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆధార్ సేవలు ఇక మరింత సులభం.. ఆన్‌లైన్‌లోనే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే అవకాశం!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 09:05 PM
67 వీక్షణలు

ఆధార్ సేవలు ఇక మరింత సులభం.. ఆన్‌లైన్‌లోనే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే అవకాశం!

కొత్త ఆధార్ నమోదు చేయించుకోవాలన్నా, ఆధార్‌లో పేరు, చిరునామా, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, బయోమెట్రిక్ వివరాలు వంటి మార్పులు చేయించుకోవాలన్నా ఇకపై ఆధార్ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఉచితంగా ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ విధానం ద్వారా ముందుగానే తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకుని అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. నిర్ణయించిన సమయానికి సంబంధిత ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి సేవలు పొందవచ్చు. దీంతో క్యూల్లో వేచి ఉండే సమయం తగ్గడంతో పాటు సేవలు కూడా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి నెలకు గరిష్టంగా రెండు అపాయింట్‌మెంట్లు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అపాయింట్‌మెంట్ బుకింగ్‌కు ఎలాంటి అదనపు రుసుము ఉండదు. అయితే ఆధార్ నమోదు లేదా వివరాల సవరణకు వర్తించే సేవా ఛార్జీలు యథావిధిగా అమల్లో ఉంటాయి.

దేశవ్యాప్తంగా ఆధార్ సేవా కేంద్రాలు సాధారణంగా ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనిచేస్తాయి. ముందస్తు అపాయింట్‌మెంట్‌తో వెళ్లే వారికి సేవలు మరింత సులభంగా, వేగంగా అందేలా ఈ కొత్త సౌకర్యం ఉపయోగపడనుంది.