BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 10:44 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే బియ్యం.. ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 10:44 AM
65 వీక్షణలు

ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే బియ్యం.. ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఆహార ధరల భారం తగ్గించేందుకు ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరలకు బియ్యం విక్రయించే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

రాష్ట్రంలోని 130 రైతు బజార్లు మరియు 500 రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు నేరుగా బియ్యం అందించనున్నారు. ఈ పథకం ద్వారా నాణ్యమైన బియ్యాన్ని మార్కెట్ ధర కంటే తక్కువకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ధరలు ఇలా ఉన్నాయి:

బీపీటీ, కేఎన్ఎం స్టీమ్ బియ్యం – కిలో రూ.52

ముడి బియ్యం – కిలో రూ.50

గ్రేడ్-2 బియ్యం – కిలో రూ.42

ఈ నిర్ణయంతో సాధారణ కుటుంబాలపై నిత్యావసర ఖర్చుల భారం కొంత మేర తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్లలో ఈ ధరలకు బియ్యం అందుబాటులో ఉండనుంది.