BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 10:44 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే బియ్యం.. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 10:44 AM
62 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం ధరలు పెరిగి సామాన్యులకు భారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 500 రైస్ మిల్లుల అవుట్‌లెట్లు, 130 రైతు బజార్లలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి తక్కువ ధరకే బియ్యం విక్రయించనున్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఇవి:

సూపర్ ఫైన్ స్టీమ్ రైస్ – కేజీ రూ.52

బీపీటీ గ్రేడ్-1 – కేజీ రూ.50

బీపీటీ గ్రేడ్-2 – కేజీ రూ.48

ప్రస్తుతం మార్కెట్లో సూపర్ ఫైన్ స్టీమ్ రైస్ రూ.62–65, బీపీటీ గ్రేడ్-1 రూ.55–58 వరకు విక్రయమవుతుండగా, ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు కిలోపై రూ.10 వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరలను నియంత్రించి, నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరల్లో ప్రజలకు అందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.