BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 03 August 2026, 08:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆగస్టు 15 నుంచి గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. సంక్షేమ బోర్డు సేవలు ప్రారంభం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:56 PM
49 వీక్షణలు

ఆగస్టు 15 నుంచి గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. సంక్షేమ బోర్డు సేవలు ప్రారంభం

తెలంగాణలో గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆగస్టు 15 నుంచి గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డు సేవలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ నిర్ణయంతో డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, లాజిస్టిక్స్ సిబ్బందితో పాటు యాప్ ఆధారిత సేవలు అందించే సుమారు 5 లక్షల మంది గిగ్ వర్కర్లు ప్రయోజనం పొందనున్నారు.

ఈ చట్టం అమల్లో భాగంగా ప్రతి గిగ్ వర్కర్‌కు ప్రత్యేక యూనిక్ ఐడీ జారీ చేయనున్నారు. అలాగే అగ్రిగేటర్ సంస్థలు ప్రతి లావాదేవీపై 1 నుంచి 2 శాతం వరకు వెల్ఫేర్ ఫీజును గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డుకు జమ చేయాల్సి ఉంటుంది. ఈ నిధులను వర్కర్ల సంక్షేమం, భద్రత, సామాజిక రక్షణ చర్యలకు వినియోగించనున్నారు.

నిబంధనలను ఉల్లంఘించే అగ్రిగేటర్ సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. తొలి ఉల్లంఘనకు రూ.50 వేల వరకు జరిమానా విధించగా, అదే తప్పు మళ్లీ చేస్తే జరిమానా ఐదు రెట్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి నిబంధనలు, మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసినట్లు వెల్లడించింది.

ఈ నిర్ణయంతో ఇప్పటివరకు సామాజిక భద్రతకు దూరంగా ఉన్న గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన రక్షణ, సంక్షేమ ప్రయోజనాలు అందే అవకాశాలు మరింత బలపడనున్నాయి.