BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 27 March 2026, 01:57 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

ఆలేరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతా

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / ఆలేరు
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
27 Mar, 2026 - 01:57 PM
264 వీక్షణలు

ఆలేరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతా--ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

తెలంగాణ రాష్ట్రంలోనే ఆలేరు నియోజకవర్గం లోని ఆలేరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు పట్టణంలోని పురపాలక సంఘం  కార్యాలయంలో నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో  బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా 2026- 2027వ ఆర్థిక సంవత్సరం యొక్క బడ్జెట్ ప్రత్యేక సమావేశానికి  సంబంధించిన అంశాలను ఇందులో చర్చించారు ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య  మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించాం. రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్ వంటి ప్రాథమిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించాం అని అన్నారు స్వచ్ఛతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ, ప్రతి వార్డు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం.తాగునీటి సమస్యలు ఎక్కడైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించాం. “మన పట్టణ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలి. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించడం మన బాధ్యతన్నారు.. “ప్రతి వార్డులో ప్రాథమిక సదుపాయాలు మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు కల్పించాలన్నారు.“ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు..ప్రజలకు అందుతున్న సేవలను మరింత వేగంగా,పారదర్శకంగా అందించాలనే విషయంపై చర్చించాం.ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించాం.పన్నులు, ఆదాయ వనరుల పెంపు ద్వారా మున్సిపాలిటీ ఆర్థిక స్థితి బలపడేలా కృషి చేయాలని సూచించాం అని అన్నారు.ప్రజల సమస్యలను వినేందుకు వార్డు స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాం అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపాలిటీ చైర్మన్ బాలమణి భాస్కర్, కమిషనర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు