BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 26 June 2026, 02:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆన్‌లైన్‌లోనే ఓటరు వివరాల నమోదు.. ఎన్నికల సంఘం కీలక సూచన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 02:34 PM
112 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2026 (Special Intensive Revision-2026) కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు ఎన్నికల సంఘం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో) కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, ఓటర్లు ఇంటి నుంచే తమ ఓటరు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు లేదా ధృవీకరించుకోవచ్చు. ఇందుకోసం voters.eci.gov.in పోర్టల్‌ను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఓటర్లు తమ ఈపిక్ (EPIC) నంబర్, ఓటీపీ సహాయంతో లాగిన్ అయి ఇప్పటికే నమోదైన వివరాలను పరిశీలించడంతో పాటు అవసరమైన మార్పులు చేసుకునే అవకాశం ఉంది. అనంతరం పాత రికార్డులతో అనుసంధానం పూర్తి చేసి, ఆధార్ ఈ-సైన్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారమ్‌ను సురక్షితంగా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఈ విధానం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు ఓటరు జాబితాలో వివరాలు మరింత ఖచ్చితంగా నమోదు అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆలస్యం చేయకుండా తమ వివరాలను ధృవీకరించి ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు.