BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 10 April 2026, 03:47 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ఆర్దిక ఇబ్బందులు ఉన్న అన్నదాతకు అండగా సర్కార్..

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
10 Apr, 2026 - 03:47 PM
78 వీక్షణలు

ఆర్దిక ఇబ్బందులు ఉన్న అన్నదాతకు అండగా సర్కార్..

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి..

రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

గొల్లపల్లి: 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం డి సి ఎం ఎస్ ల ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

శుక్రవారం గొల్లపల్లి మండలంలోని వ్యవసాయ మార్కెట్ లో మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతులు ధర్మపురి నియోజకవర్గంలో అధికంగా మొక్కజొన్న సాగు చేశారని అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, వెల్గటూర్, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి మరియు ఎండపల్లి మండలాల్లో సీజన్ లో 4898 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారని మంత్రి తెలిపారు.

ఆరు మండలాల్లో సుమారుగా 1.46 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని మంత్రి తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున పంట సాగు చేసిన నేపథ్యంలో రైతులకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వం మక్కజోన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.

రైతులు పండించిన పంటను దళారులు క్వింటాలుకు రూ. 1600 మాత్రమే చెల్లించి కొనుగోలు చేస్తున్నారని మంత్రి వివరించారు. రైతులకు మద్దతు ధర అందించాలని ప్రజా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని మంత్రి తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు విక్రయించి క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర పొందాలని మంత్రి కోరారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోలేదని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోలు లో క్వింటాల్ కు నాలుగు కిలోల కోత విధించారని మంత్రి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాలుగా ఎలాంటి కోత లేకుండా రైతులు పండించిన పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు