BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 March 2026, 03:21 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ఆరెపెల్లి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానం

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
21 Mar, 2026 - 03:21 PM
115 వీక్షణలు

ఆరెపెల్లి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానం: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసిన గ్రామస్తులు

ధర్మపురి మండలం ఆరెపెల్లి గ్రామంలో త్వరలో జరగనున్న శ్రీ సీతారామ చంద్ర స్వామి సహిత ఆంజనేయస్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు శనివారం కరీంనగర్‌లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

23 నుంచి 25 వరకు వేడుకలు:

ఆరెపెల్లి గ్రామంలో ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఆలయంలో ఆదిత్యాది నవగ్రహ ధ్వజస్తంభ, శిలా విగ్రహ మరియు యంత్ర ప్రతిష్టాపన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

మాజీ మంత్రి స్పందన:

ఆహ్వానాన్ని స్వీకరించిన కొప్పుల ఈశ్వర్ గారు గ్రామస్తులతో ముచ్చటించారు. భక్తిభావంతో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాపన మహోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడం శుభపరిణామమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు, గ్రామ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.