BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 14 July 2026, 08:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆర్టీఐ లో తప్పుడు సమాచారం?.. ఎంపీడీవో, పీఐవోలపై విజిలెన్స్‌కు ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 08:04 PM
124 వీక్షణలు

ఆర్టీఐ లో తప్పుడు సమాచారం?.. ఎంపీడీవో, పీఐవోలపై విజిలెన్స్‌కు ఫిర్యాదు

తిరుపతి జిల్లా: ప్రభుత్వ విధులకు ప్రైవేట్ (వైట్ బోర్డు) వాహనాన్ని ఉపయోగిస్తూ, సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద మాత్రం కమర్షియల్ (ఎల్లో బోర్డు) వాహనాన్ని అద్దెకు తీసుకున్నట్లు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఓ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) మరియు మండల పౌర సమాచార అధికారి (పీఐవో)పై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన తిరుపతి జిల్లాలో చర్చనీయాంశమైంది.

ఫిర్యాదు వివరాల ప్రకారం, సదరు ఎంపీడీవో అధికారికంగా ఏ వాహనాన్ని ఉపయోగిస్తున్నారనే అంశంపై ఓ పౌరుడు ఆర్‌టీఐ చట్టం కింద సమాచారం కోరారు. దీనికి ప్రతిస్పందనగా అధికారులు ఒక ప్రైవేట్ వ్యక్తికి చెందిన ఎల్లో బోర్డు కమర్షియల్ వాహనాన్ని అద్దెకు తీసుకుని అధికారిక విధులకు వినియోగిస్తున్నట్లు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు.

అయితే, క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఫిర్యాదుదారుడు ఎంపీడీవో ప్రభుత్వ విధులకు తన సొంత వైట్ బోర్డు వాహనాన్నే ఉపయోగిస్తున్నట్లు గుర్తించినట్లు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, ఇతర ఆధారాలను సేకరించి విజిలెన్స్ అధికారులకు సమర్పించినట్లు సమాచారం.

ప్రభుత్వ ఖజానా నుంచి అద్దె వాహనం పేరిట బిల్లులు చెల్లించుకుంటూ, వాస్తవానికి సొంత వాహనాన్ని వినియోగిస్తున్నారనే అనుమానాలను ఫిర్యాదుదారుడు వ్యక్తం చేశారు. ఆర్‌టీఐ కింద కూడా వాస్తవాలకు విరుద్ధంగా సమాచారం ఇచ్చారని ఆయన ఆరోపించారు.

ఈ ఫిర్యాదుపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత ఎంపీడీవో, పీఐవో లేదా విజిలెన్స్ అధికారుల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. విచారణ అనంతరం మాత్రమే ఆరోపణల నిజానిజాలు తేలనున్నాయి.