BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 02:40 pm
Posted by : V శ్రీనివాస్

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సర్కార్ చర్చలకు రావాల్సిందే

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
23 Apr, 2026 - 02:40 PM
128 వీక్షణలు

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సర్కార్ చర్చలకు రావాల్సిందే: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు డిమాండ్

​కాంగ్రెస్ పాలనలో కార్మికులకు అన్యాయం.. 36 డిమాండ్ల పరిష్కారం కోసం బీజేపీ సమరశంఖం

మంచిర్యాల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జరిగిన మద్దతు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘకాలంగా పోరాడుతున్న 36 డిమాండ్లలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తోందని, కార్మికుల పట్ల ఈ వివక్ష ఏమాత్రం సరికాదని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్మిక సమస్యలను గాలికొదిలేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సామరస్యంగా సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికుల పక్షాన బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్మికులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ తరపున పోరాటాలు కొనసాగిస్తామని రఘునాథరావు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు..