BREAKING
thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు
Date of Publish : 06 August 2026, 11:11 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆర్థిక సమతుల్యతతోనే అభివృద్ధి – సంక్షేమం సాధ్యం: ఎం. సునీల్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Aug, 2026 - 11:11 PM
64 వీక్షణలు

నూజివీడు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా చర్యలు తీసుకుంటోందని జనసేన పార్టీ నాయకుడు ఎం. సునీల్ కుమార్ పేర్కొన్నారు. నూజివీడులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏ ప్రభుత్వానికైనా ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవడం అత్యంత కీలకమైన బాధ్యత అని అన్నారు. మానవ వనరులపై అదుపు తప్పిన వ్యయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుందని చెప్పారు.

గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిడికి గురైందని, ఆదాయంతో పోలిస్తే వ్యయం 123 శాతానికి చేరిందని అన్నారు. అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకువచ్చి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇది ఒక్క రోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదని, దశలవారీగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాలు తగ్గిపోయాయని కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని సునీల్ కుమార్ విమర్శించారు. గతంలో సాధారణ పెన్షన్ రూ.3 వేలుగా ఉండగా ప్రస్తుతం రూ.4 వేలకు పెంచామని, దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు, తీవ్ర వైకల్యం ఉన్న వారికి రూ.15 వేలుగా అందిస్తున్నామని తెలిపారు. రైతులకు సంవత్సరానికి రూ.20 వేల ఆర్థిక సాయం, మత్స్యకారులకు రూ.20 వేలు, ఆటో–టాక్సీ డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున అందజేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యంతో పాటు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు. కేవలం రెండేళ్లలోనే రూ.1.49 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనాలు అందించిన ప్రభుత్వం ఇదేనని అన్నారు.

కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, ఎవరు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారో, ఎవరు కేవలం విమర్శలకే పరిమితమవుతున్నారో ప్రజలకు స్పష్టంగా తెలుసని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రహదారుల పరిస్థితి, రాజధాని అభివృద్ధి నిలిచిపోయిన తీరు, రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలు మరచిపోలేదని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని సునీల్ కుమార్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి శాఖకు సమన్యాయం జరిగేలా పనిచేస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అనుభవం, దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి బలమైన మద్దతు లభిస్తోందని ఆయన అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఇంకా ఎన్నో సంవత్సరాలు సేవలందిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.