రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి గాయం.. ఆస్పత్రిలో పరామర్శ
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
కనిగిరి
కనిగిరి: ఏపీ మోడల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి బద్రీనాథ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
శుక్రవారం పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో మోడల్ స్కూల్ ఆర్చ్ వద్ద ఆటో ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా పొనుగోడు వైపు వెళ్తున్న మోటార్‌సైకిల్ విద్యార్థిని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో బద్రీనాథ్ కాలికి గాయమై, ఎముక విరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన బద్రీనాథ్ కనిగిరిలోని గోపీనాథ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న పాఠశాల ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్ పందిటి మోహన్ సత్యం సురేష్ ఆదివారం ఆస్పత్రికి వెళ్లి బద్రీనాథ్‌ను పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.