BREAKING
thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Date of Publish : 30 August 2026, 07:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆరుగొలనుపేట పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:46 AM
65 వీక్షణలు

ఆరుగొలనుపేట పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

గిడుగు వెంకట రామమూర్తి పంతులు సేవలు చిరస్మరణీయం

ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం ఆరుగొలనుపేట మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. చంద్రు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తెలుగు భాషా అభివృద్ధికి గిడుగు వెంకట రామమూర్తి పంతులు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజలందరికీ సులభంగా అర్థమయ్యే వ్యవహారిక భాషకు ఆయన విశేష ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. తెలుగు భాషను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు తెలుగు భాషపై మక్కువ పెంచుకుని దాని గొప్పతనాన్ని తెలుసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని తెలుగు భాష గొప్పతనాన్ని వివరించే ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.