BREAKING
thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Date of Publish : 30 August 2026, 07:45 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేటలో వంట ఏజెన్సీలు, పారిశుధ్య కార్మికుల పెండింగ్ వేతనాల కోసం ధర్నా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:45 AM
121 వీక్షణలు

విస్సన్నపేటలో వంట ఏజెన్సీలు, పారిశుధ్య కార్మికుల పెండింగ్ వేతనాల కోసం ధర్నా

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట:

వంట ఏజెన్సీలు, పాఠశాల పారిశుధ్య కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీటీయూ అనుబంధ అఖిల భారత వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విస్సన్నపేటలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి మేకల కుమారి నాయకత్వం వహించారు.

ఈ ధర్నాలో ఏఐసీసీటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య, దుర్గం పుల్లారావు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ హాజరై మాట్లాడారు.

సుప్రీంకోర్టు పారిశ్రామిక వివాదాల చట్ట సవరణపై ఇచ్చిన తీర్పును ఆయన విమర్శించారు. ఈ తీర్పు కార్మిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్కీం వర్కర్లందరికీ కనీస వేతనం రూ.46 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పాఠశాల పారిశుధ్య కార్మికులు, మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీలకు రావాల్సిన వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు.

మధ్యాహ్న భోజన ఏజెన్సీలను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అప్పగించే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

అనంతరం విస్సన్నపేట మండల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు.