BREAKING
వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం కోతి సమాధి వద్ద శ్రావణ శోభ,పోటెత్తిన భక్తజనం కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ నందమూరి హరికృష్ణకు ఘనంగా 8వ వర్ధంతి
Date of Publish : 30 August 2026, 07:47 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వెలిగొండ సాధన కమ్యూనిస్టుల పోరాట ఫలితమే: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:47 AM
3 వీక్షణలు

వెలిగొండ నిర్వాసితులు, సీపీఎం నేతల నిర్బంధం తగదు

విజయవాడ: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో నిర్వాసితులు, సీపీఎం నాయకులను పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. వారిని వెంటనే విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

ఈ నెల 31న ముఖ్యమంత్రి వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరవుతున్న నేపథ్యంలో, నిర్వాసితుల్లో 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులు, నిర్వాసితుల హక్కుల కోసం పోరాడుతున్న సీపీఎం జిల్లా నాయకులను బైండోవర్ పేరుతో పోలీసులు స్టేషన్లకు తరలిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు కోసం కమ్యూనిస్టు పార్టీలు మూడు దశాబ్దాలుగా నిరంతర పోరాటాలు చేస్తున్నాయని శ్రీనివాసరావు తెలిపారు. 1996లో సీపీఎం, సీపీఐ రాష్ట్ర నాయకుల ఒత్తిడితో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు అంగీకరించారని గుర్తు చేశారు.

శంకుస్థాపన అనంతరం పనులు నత్తనడకన సాగడంతో సీపీఎం, సీపీఐతో పాటు ఇతర వామపక్ష పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, మాజీ ఇంజినీర్లు ప్రజలను సమీకరించి అనేక ఉద్యమాలు నిర్వహించాయని తెలిపారు. పాదయాత్రలు, నిరసనలు చేపట్టి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు కోసం ఇన్నేళ్లుగా పోరాడిన పార్టీని, నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసినందుకు నిర్బంధించడం అప్రజాస్వామికమని శ్రీనివాసరావు అన్నారు. ప్రాజెక్టులో నీరు విడుదలకు ముందే నిర్వాసితులకు పరిహారం, పునరావాస ప్యాకేజీలు అందించాలని నిర్వాసితుల సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగాయని తెలిపారు.

ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం నిర్వాసితులకు నిధులు విడుదల చేయాల్సి వచ్చిందన్నారు. గతంలో నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఉద్యమాల వల్లే విఫలమయ్యాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎక్కువ మంది నిర్వాసితులకు పరిహారం అందడానికి వారి పోరాటాలే కారణమని అన్నారు. అయితే 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులకు 2019 ప్యాకేజీ అమలు చేయకుండా కేవలం రూ.2 లక్షలతో సరిపెట్టడం అన్యాయమని విమర్శించారు.

నిర్వాసితులు ప్రభుత్వానికి సహకరిస్తున్నప్పటికీ ప్రభుత్వం వారిపట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వెంటనే నిర్బంధాలను నిలిపివేసి, వెలిగొండ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.