BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 26 June 2026, 06:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆసిఫాబాద్‌లో ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు.. భూములు వదులుకోమంటూ ఆందోళన

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:46 PM
103 వీక్షణలు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ భూముల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. జైనూర్ మండలం పులస గ్రామ శివారులో అటవీ భూమిని జేసీబీతో చదును చేసేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

తమ తాతముత్తాతల కాలం నుంచి ఇదే భూముల్లో సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, ఇందుకు సంబంధించిన హక్కు పత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు భూములను స్వాధీనం చేసుకోవడానికి వస్తే తమ కుటుంబాలు ఎలా బతకాలని అధికారులను ప్రశ్నించారు.

"మమ్మల్ని అరెస్ట్ చేసినా, చంపినా ఈ భూములను వదులుకోం. మా జీవనాధారం ఇదే. భూములు పోతే ఉపాధి కోల్పోయి కుటుంబాలతో రోడ్డున పడాల్సి వస్తుంది" అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు, రైతులతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.