BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 January 2026, 08:47 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

అవమానించిన పూజారులపై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ
24 Jan, 2026 - 08:47 PM
328 వీక్షణలు
దళిత మహిళను అవమానించిన పూజారులపై చర్యలు తీసుకోవాలి NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్: రాఘవేంద్ర రాజు ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ) ఆధ్వర్యంలో అంటరానితనం, కుల వివక్షతకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శంకరప్ప మాట్లాడుతూ, కర్నూలు జిల్లా ఓర్వగల్ మండలం సోమయాజులపల్లి గ్రామంలోని గ్రామ దేవత సుంకులమ్మ ఆలయంలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. అదే గ్రామానికి చెందిన దళిత మహిళ, జిల్లా ఎస్సీ ఎస్టీ బాండ్రీ కమిటీ సభ్యురాలు మాలతి సంక్రాంతి పండుగ సందర్భంగా గుడిలో పూజ కోసం వెళ్లగా, అక్కడి పూజారులు బలిజి జనార్ధన్ మరియు అతని కుమారుడు వంశీ ఆమెను కులం పేరుతో దూషిస్తూ, గుడిలోకి ప్రవేశించరాదని చెప్పి అవమానించినట్లు ఆరోపించారు. దళిత మహిళపై అసభ్య పదజాలంతో దూషించి, అంటరానితనం ప్రదర్శిస్తూ గుడి బయట నిలబెట్టి అవమానించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే పూజారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, వారిని ఆలయం నుంచి తొలగించాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర హోం శాఖ, పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి చట్టరీతిగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పుంగనూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని త్రొక్కే విధంగా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని దళిత నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర సెక్రటరీ చీటీ గంగప్ప, ప్రచార కార్యదర్శి పెంచుపల్లి కృష్ణప్ప, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కె. లక్ష్మీపతి, రాష్ట్ర కమిటీ సభ్యుడు మర్లపల్లి కృష్ణప్ప, జిల్లా కార్యదర్శి ఎస్. నాగరాజు, దళిత నాయకులు ఏ. కుమార్, ఈస్ట్ పేట బాలాజీ, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. #DalitRights #CasteDiscrimination #SCSTAtrocitiesAct #SocialJustice #StopUntouchability #HumanRights #AndhraPradesh #Punganur #DalitWomenRights Follow us on Website Facebook Instagram YouTube