BREAKING
thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. thumb మోదుగులపల్లి టీడీపీ నేతకు నారా లోకేష్ ప్రశంసా పత్రం thumb శారదా కాలనీలో తాపీ మేస్త్రి మృతి thumb గణేష్ నిమజ్జనంలో యువకుడు గల్లంతు thumb మోదీ జన్మదినం సందర్భంగా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపు thumb రావులపాలెంలో పనీర్‌పై ఫిర్యాదు.. మిల్క్ పార్లర్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు thumb లద్దిగంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు thumb గుండ్రాంపల్లి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి thumb ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం.
Date of Publish : 03 August 2026, 05:06 pm
Posted by : NTODAY NEWS

ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ.. ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
03 Aug, 2026 - 05:06 PM
44 వీక్షణలు

మహేశ్వరం | ఆగస్టు-3 | NTODAY NEWS

తుక్కుగూడ పట్టణంలో ఏఐటీయూసీ (AITUC) రంగారెడ్డి జిల్లా నాలుగో మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, శాసనమండలి సభ్యుడు నెలకంటి సత్యం, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి. యూసుఫ్ హాజరయ్యారు.

జిల్లా నలుమూలల నుంచి సుమారు 250 మంది ప్రతినిధులు పాల్గొని కార్మిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.

అనంతరం జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వడ్ల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బీ. దత్తు నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 9 మంది ఆఫీస్ బేరర్లు, 35 మంది కార్యవర్గ సభ్యులు, 57 మంది కౌన్సిల్ సభ్యులను కూడా మహాసభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన ప్రధాన కార్యదర్శి బీ. దత్తు నాయక్ మాట్లాడుతూ, రాష్ట్ర నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడతామని అన్నారు. కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా నాయకులు పానుగంటి పర్వతాలు, రామస్వామితో పాటు నూతనంగా ఎన్నికైన ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.