BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 29 March 2026, 04:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా చింతలపూడిలో జన జాగృతి కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 04:39 PM
154 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం అల్లిపెల్లి గ్రామంలోని RCM పాఠశాలలో నిర్వహించిన జన జాగృతి కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా మోకాసత్తిబాబు (అడిషనల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ – ట్రైనింగ్, మంగళగిరి) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుపై ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. అంబేద్కర్ జీవనశైలిని ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో చదవాలని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారిని ప్రోత్సహించాలని సూచించారు.

తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తీసుకుంటూ చదువుకొని ఈ స్థాయికి చేరుకున్నానని, తన ఎదుగుదలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి స్ఫూర్తే కారణమని ఆయన తెలిపారు. చదువు మనిషి జీవితాన్ని మార్చే శక్తి కలదని, విద్యార్థులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో ఫాదర్ మరియజోజి రాయి, సాయి స్పూర్తి హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్లు, నర్సులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.