BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 04:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్
/ శ్రీకాకుళం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jul, 2026 - 04:13 PM
81 వీక్షణలు

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దుబ్బ దానయ్య కుటుంబాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా దివంగత కొలుసు పెద్ద రెడ్డయ్య యాదవ్ స్మారకార్థం నిర్వహిస్తున్న కొలుసు పెద్ద రెడ్డయ్య యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.2 లక్షలు, యాదవ్ సంఘం తరఫున రూ.3 లక్షలు కలిపి మొత్తం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి మంత్రి అందజేశారు.

మంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగేలా కట్టుబడి ఉన్నామని తెలిపారు. అవసరమైన సహాయ సహకారాలు అందేలా వ్యక్తిగతంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.