BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 18 May 2026, 08:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో రూ.2500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 08:21 PM
176 వీక్షణలు

అమరావతి: రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ సీఈఓ గోవింద రాజన్ నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాళ్లకుప్పం, వానల్లూరు గ్రామాల వద్ద రూ.2500 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక బుల్లెట్ మోటార్‌సైకిల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రతిపాదిత ప్రాజెక్టులో అత్యాధునిక తయారీ యూనిట్‌తో పాటు టెస్టింగ్ ట్రాక్, పరిశోధనా కేంద్రం, వెండార్ పార్క్ ఎకోసిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 9 లక్షల బుల్లెట్ మోటార్‌సైకిళ్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 15 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.

ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి 18 నెలల్లో నిర్మాణ పనులు ముగించి బుల్లెట్ మోటార్‌సైకిళ్ల ఉత్పత్తి ప్రారంభించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.