BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 19 April 2026, 11:07 am
Posted by : యామనూరి మల్లికార్జున

ఏప్రిల్ 21న శంకరజయంతి

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
19 Apr, 2026 - 11:07 AM
173 వీక్షణలు

ఏప్రిల్ 21న శంకరజయంతి

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 

ఏప్రిల్ 21వ తేదీ వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా ఆదిశంకరుల వారి జయంతి ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ జయంతి ఉత్సవంలో భాగంగా ఫాలధార -పంచధారల వద్ద గల శంకరమందిరంలో ఉదయం గం.9.00లకు ప్రత్యేక పూజలు జరిపించబడతాయి. ఈ విశేష పూజలలో చంద్రమౌళీశ్వరస్వామికి, శారదాదేవికి, శంకరుల వారికి జలాభిషేకం,  బిల్వపత్రపూజ, నీరాజన  మంత్రపుష్పములు, అర్చనలు జరుగనున్నాయి.

కాగా ఆదిశంకరుల వారికి, శ్రీశైల క్షేత్రానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. శంకరులవారు శ్రీశైలంలోని ఫాలధార –పంచధార వద్ద కొంతకాలం తపస్సు చేసి ఇక్కడే తమ శివానందలహరి గ్రంథాన్ని రచించారు. ఈ శివానందలహరిలో శ్రీశైలక్షేత్రాన్ని, శ్రీభ్రమరాంబా మల్లికార్జునులను స్తుతించారు. అదేవిధంగా శంకరుల వారు యోగతారావళి అనే గ్రంథంలో శ్రీశైలంలోనే సమాధిని పొందాలని అభిలషించారని చెప్పబడుతోంది.