BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 16 May 2026, 09:05 am
Posted by : కూనురు మధు

ఐకేపీ కేంద్రాల్లో నకిరేకల్ ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ.

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
16 May, 2026 - 09:05 AM
336 వీక్షణలు

NTODAY NEWS చిట్యాల 

తూకాలు, సౌకర్యాలపై ఆరా!

ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.నార్కట్పల్లి పట్టణ కేంద్రం, కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం  ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియ, ధాన్యం తూకాలు, రైతులకు అందుతున్న సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడుతూ ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునీ,ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఆలస్యం జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు."రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కాలి. తేమ, తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు"అని స్పష్టం చేశారు. అనంతరం చిట్యాల పట్టణంలోని వరలక్ష్మి మిల్ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం దిగుమతి కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం నిల్వ, రవాణా, దిగుమతి ప్రక్రియలను సమీక్షించి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు."రైతుల శ్రమకు తగిన గౌరవం దక్కేలా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని  తెలిపారు.ఎమ్మెల్యే వెంట చిట్యాల ఎమ్మార్వో విజయ్ కుమార్, నార్కట్పల్లి ఎమ్మార్వో వెంకటేశ్వర రావు, చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ పందిరి గీత రమేష్,ఆర్ ఐ జానీ షరీఫ్, మున్సిపాలిటీ కౌన్సిలర్ ఏర్పుల పరమేష్, నార్కెట్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బత్తుల ఉషయ్య, వ్యవసాయ అధికారులు తదితరులున్నారు.