BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 02 August 2026, 11:02 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అక్కపాలెం శివారులో జూద శిబిరంపై పోలీసుల మెరుపు దాడి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 11:02 AM
64 వీక్షణలు

అక్కపాలెం శివారులో జూద శిబిరంపై పోలీసుల మెరుపు దాడి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం అక్కపాలెం గ్రామ శివారులో నిర్వహిస్తున్న కోతముక్క జూద శిబిరంపై తిరువూరు పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు తిరువూరు పోలీస్ స్టేషన్ ఎస్సై శాతకర్ణి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించిన దాడిలో కోతముక్క జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి రూ.1,800 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రజలకు పోలీసుల హెచ్చరిక

ప్రభుత్వం నిషేధించిన జూద కార్యకలాపాల్లో పాల్గొనడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. జూదం కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయడంతో పాటు సామాజిక శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని, ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.